Census 2025 : జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi0 అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం(Union Cabinet meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Census 2025 : జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi0 అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం(Union Cabinet meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. త్వరలోనే దేశ జనాభా లెక్కల(Population Census)కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. జనాభా లెక్కలతోపాటే కులగణన(Cast Census) కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జనాభా లెక్కలు 2021 లోనే చేపట్టాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం వలన వాయిదా వేశారు.

అలాగే సిల్చార్‌-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే చెరుకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story