ఆలోపు వెళ్లిపోండి.. పాక్ పౌరులకు భారత్ మరో ఛాన్స్

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే దేశంలోని పాక్ పౌరులు సొంత దేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆలోపు వెళ్లిపోండి.. పాక్ పౌరులకు భారత్ మరో ఛాన్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే దేశంలోని పాక్ పౌరులు సొంత దేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న అటారీ వాఘా (Attari vagha) మార్గాన్ని మూసివేస్తామని ఆలోపు వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే తాజాగా దీనిపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కూడా అట్టారీ వాఘా బార్డర్ మీదుగా పాకిస్థాన్ పౌరులు వెళ్లిపోవచ్చని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మొత్తం 926 మంది పాకిస్థానీయులు భారత్( India) విడిచి తమ దేశానికి వెళ్లిపోయారు. కానీ కొంతమంది పాక్ పౌరులు అనేక కారణాల వల్ల దేశంలోనే ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చినవారు, అత్యవసర పనులపై వచ్చినవారు తమకు మరికొంత సమయం కావాలన్ని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం వెసులుబాటు కనిపించినట్టు తెలుస్తోంది.

Next Story