- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kartavya Bhawan: సెంట్రల్ విస్టా రీడవలప్‌మెంట్ ఏరియాను ఇకపై కర్తవ్య భవన్ కాంప్లెక్స్‌గా పిలువాలి
భవిష్యత్తులో అధికారిక పత్రాలు, ప్రకటనలు, అన్ని ప్రభుత్వ కమ్యూనికేషన్‌లలో 'సెంట్రల్ విస్టా' అనే పేరును ఉపయోగించవద్దని సూచించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని 'సెంట్రల్ విస్టా' రీడెవలప్‌మెంట్ ప్రాంతానికి ఇకపై 'కర్తవ్య భవన్ కాంప్లెక్స్' లేదా 'కర్తవ్య భవన్ ప్రాంతం' అనే పేర్లనే ఉపయోగించాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ స్పష్టం చేశారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో అధికారిక పత్రాలు, ప్రకటనలు, అన్ని ప్రభుత్వ కమ్యూనికేషన్‌లలో 'సెంట్రల్ విస్టా' అనే పేరును ఉపయోగించవద్దని సూచించారు. కర్తవ్య మార్గ్, ఇప్పటికే నిర్మించిన మూడు కర్తవ్య భవనాలు, భవిష్యత్తులో నిర్మించనున్న మొత్తం 10 కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు కలిసిన ఈ సముదాయాన్నే 'కర్తవ్య భవన్ ప్రాంతం'గా గుర్తిస్తామని చెప్పారు. వందేళ్ల క్రితం నిర్మించిన రాజధాని భవనాలు చరిత్రలో నిలిచిపోయినట్లే, ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ భవనాలు కూడా దేశ చరిత్రలో భాగమవుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. 2022లో 'రాజ్‌పథ్' పేరును 'కర్తవ్య పథ్'గా మార్చిన తర్వాత, కొత్త ప్రభుత్వ భవనాలకు 'కర్తవ్య భవనాలు', ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న కొత్త సముదాయానికి 'సేవా తీర్థ్' అనే పేర్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మొత్తం రీడెవలప్‌మెంట్ ప్రాంతానికే 'కర్తవ్య భవన్ ప్రాంతం' అనే అధికారిక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించింది.






