ఉస్మానాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్పు.. సెంట్రల్ రైల్వే ప్రకటన

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ రైల్వేస్టేషన్ (Usmanabad Railway Station) పేరును మార్చినట్లు సెంట్రల్ రైల్వే (Central Railway) అధికారికంగా ప్రకటించింది. ఉస్మానాబాద్ స్టేషన్ పేరును ధారాశివ్ (Dharashiv)గా మార్చినట్లు తెలిపింది.

ఉస్మానాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్పు.. సెంట్రల్ రైల్వే ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ రైల్వేస్టేషన్ (osmanabad Railway Station) పేరును మార్చినట్లు సెంట్రల్ రైల్వే (Central Railway) అధికారికంగా ప్రకటించింది. ఉస్మానాబాద్ స్టేషన్ పేరును ధారాశివ్ (Dharashiv)గా మార్చినట్లు తెలిపింది. కొత్త స్టేషన్ పేరు, కోడ్ (UMD, DRSV)లకు ఇండియన్ రైల్వేస్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆమోదం తెలిపినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. మహారాష్ట్ర సర్కార్ 2023లో ఉస్మానాబాద్ జిల్లా పేరును ధారాశివ్ గా మార్చింది. ఈ పేరు మార్పును అమలు చేసేందుకు ముంబై ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) జూన్ 1 రాత్రి 11.25 గంటల నుంచి తెల్లవారుజామున 01.30 వరకూ టెంపరరీగా మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాగా.. ఉస్మానాబాద్ కు ఆ పేరు 20వ శతాబ్దపు హైదరాబాద్ రాచరిక రాష్ట్ర పాలకుడి పేరు మీద పెట్టినట్లు తెలుస్తోంది. ధారాశివ్ అనేది ఈ ప్రాంతంలోని 8వ శతాబ్దానికి చెందిన ఒక గుహ సముదాయం పేరు.

Next Story