- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం సోరెన్‌కు ఈడీ షాక్.. బీఎండబ్ల్యూ కారు సీజ్
దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వెంటాడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వెంటాడుతోంది. తాజాగా సోమవారం ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసంపైనా ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. అయితే ఆ టైంలో ఇంట్లో హేమంత్ లేరు. దీంతో అక్రమ నిధులను ఉపయోగించి సీఎం సోరెన్ కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్న బీఎండబ్ల్యూ కారు సహా పలు కీలకమైన ఆస్తిహక్కు డాక్యుమెంట్లను ఈడీ సీజ్ చేసింది. సోరెన్ వస్తారేమోనని భావించి.. కొందరు ఈడీ అధికారులు సోమవారం అర్థరాత్రి వరకు ఆయన ఇంటి బయటే మకాం వేసి ఎదురుచూశారు. ఈనేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈడీకి చెందిన మెయిల్ ఐడీకి ఒక మెయిల్ అందింది. ‘‘జనవరి 31న మధ్యాహ్నం 1 గంటల్లోగా హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని ఇంటికొచ్చి విచారించవచ్చు’’ అని అందులో తెలిపారు. విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటివరకు ఈడీ జారీ చేసిన ఏడు సమన్లకు కూడా హేమంత్ సోరెన్ స్పందించలేదు. ఈడీ సమన్ల వ్యవహారాన్ని ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసేందుకు జార్ఖండ్ సీఎం రెడీ అవుతున్నారని సమాచారం.






