తండ్రిని కోల్పోయా..ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు..విమాన ప్ర‌మాదంపై రామ్మోహ‌న్ నాయుడు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-14 09:21:17  IST  )

అహ్మదాబాద్ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.

తండ్రిని కోల్పోయా..ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు..విమాన ప్ర‌మాదంపై రామ్మోహ‌న్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసిందని అన్నారు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయానని ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రెండు రోజులుగా బాధ‌గా ఉన్నానని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఏఏఐబీ డీజీ దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుస్తాయని అన్నారు. ప్రమాద ఘటనపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో క‌మిటీ వేశామ‌ని చెప్పారు. మూడు నెల‌ల్లో క‌మిటీ నివేదిక ఇస్తుంద‌ని అన్నారు. బోయింగ్ 787 భ‌ద్ర‌త‌పై కూడా ద‌ర్యాప్తుకు ఆదేశించామ‌ని తెలిపారు. బోయింగ్ 787 విమానాలు మొత్తం 34 ఉన్నాయ‌ని అన్నారు. ఏడు విమానాల భ‌ద్ర‌త‌పై స‌మీక్ష జ‌రిగింద‌ని, దర్యాప్తు వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని అన్నారు.

‘రామ్మోహన్‌ను రాజీనామ చేయాలనడం దారుణం’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Next Story