- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచన.. వైమానిక దాడులు జరగనున్నాయా?
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తుండగా... ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావొచ్చుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ(Central Home Ministry) అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. వైమానిక దాడులు జరగనున్నాయనే రహస్య సమాచారం మేరకు వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలియజేసింది.
ఈనెల 7న సివిల్ మాక్ డ్రిల్(Civil Mock Drill) నిర్వహించాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లకు, ఆయా రాష్ట్రాల విమానశ్రయాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) ఆదేశాలు జారీ చేశారు. ఇరు దేశాలు యుద్ధం కోసం సన్నద్ధం అవుతుండగా.. తాజాగా కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వులు కీలక పరిణామాలను సూచిస్తున్నాయి. కాగా నేడు పాక్ మరోసారి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం చేపట్టిన నేపథ్యంలో.. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగవచ్చునని తెలుస్తోంది.






