- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Wikipediaకి నోటీసులు పంపిన కేంద్రం
by Pulgam srinivas |
వికీపీడియాకు కేంద్రం నోటీసులు పంపించింది. ఈ మేరకు వికీపీడియా యాజమాన్యానికి ఓ లేఖ కూడా పంపించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వికీపీడియాకు కేంద్రం నోటీసులు పంపించింది. ఈ మేరకు వికీపీడియా యాజమాన్యానికి ఓ లేఖ కూడా పంపించింది. అందులో వెబ్‌సైట్‌లో పక్షపాత సమాచారం ఉంటోందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వికీపీడియాలో సమాచారాన్ని ఎవరుపడితే వాళ్లు ఎడిట్ చేసి వాళ్లకి ఇష్టం వచ్చినట్లు నమోదు చేయడాన్ని తప్పు బట్టిన కేంద్రం.. వికీపీడియా కేవలం మీడియేటర్‌గా కాకుండా తప్పొప్పులను సరిచూడడంపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది.
Next Story






