- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ అరెస్ట్ మోసాలకు ఇకపై చెక్.. కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్రం
డిజిటల్ అరెస్టులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రతిపాదనలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇటీవల పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వేళ ఈ తరహా మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. టెలికాం, బ్యాంకింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన నిబంధనలను అమలు చేసేలా తాజాగా పలు కీలక ప్రతిపాదనలు చేసింది. పలు రంగాల నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందిచిన ఈ ప్రతిపాదనలను కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించాక అమలు కోసం టెలీకమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆర్‍బీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక చర్యలు:
సిమ్ కార్డుల జారీలో పారదర్శకత కోసం టెలీకమ్యూనికేషన్ (యూజర్ ఐడెంటిఫికేషన్) రూల్స్ తో పాటు తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ వ్యవస్థను కఠినంగా అమలు చేయించాలి. సిమ్ యాక్టివేషన్ చేసే పీఓఎస్ విక్రయదారులను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేయాలి. ఏదైనా కేసు దర్యాప్తు సమయంలో సబ్ స్క్రైబర్ యాక్టివేషన్ వివరాలు అందించాలని పీఓఎస్, టెలికాం ఆపరేటర్లను ఆదేశించాలి. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలకు ఉపయోగించే మోసపూరిత సిమ్ కార్డులను వీలైనంత త్వరగా బ్లాక్ చేయాలి. వినియోగదారులు వాట్సాప్ వంటి యాప్‍లు వాడాలంటే తప్పనిసరిగా సిమ్-బైండింగ్ ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎక్కువసేపు సాగే మోసపూరిత కాల్స్‌ను గుర్తించేలా ఈ యాప్‌లో అధునాతన ఫీచర్లను తీసుకురావాలి. నేరగాళ్లు పదే పదే వేర్వేరు నంబర్లతో ఖాతాలు సృష్టించకుండా, వారి డివైజ్ ఐడిలను బ్లాక్ చేసే వ్యవస్థను తీసుకురావాలి.
సైబర్ నేరాలకు ఉపయోగించే అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా వాటిని నిలిపివేయాలి. ఇందుకోసం ఆర్‌బీఐ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించేలా ఆదేశాలివ్వాలి. డిలీట్ చేసిన ఖాతాల డేటాను కనీసం 180 రోజుల పాటు భద్రపరచాలని, సైబర్ నేరాల కేసుల్లో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని వాట్సాప్‌ను ఆదేశించారు. సైబర్ మోసాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను అనుమానం రాగానే వెంటనే తాత్కాలికంగా నిలిపివేసే (Debit Hold) విధానాన్ని అమలు చేసేలా ఆర్‌బీఐ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించేలా ఆదేశాలివ్వాలి. ఐటీ చట్టం 2000 కింద ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను వేగవంతం చేయాలని, డిజిటల్ మధ్యవర్తులకు (Intermediaries) ఆర్థిక మోసాల్లో పౌర బాధ్యతను పెంచేలా చట్టాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.






