కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 15:01:28  IST  )

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం
X

దిశ, వెబ్‌డస్క్: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అందుకు సంబంధించి పర్యావరణ శాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎలాంటి మైనింగ్ జరగబోదని స్పష్టం చేసింది.

కాగా, ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. నవంబర్ 20న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆరావళి హిల్స్, రేంజెస్‌కు యూనిఫాం డెఫినిషన్ ఆమోదించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం ఒక హిల్ స్థానిక భూమి నుంచి కనీసం 100 మీటర్లు ఎత్తు ఉండాలని నిర్ణయించారు. 500 మీటర్ల దూరంలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ హిల్స్‌తో కలిసి, మధ్యలో ఉన్న ప్రాంతాలు కూడా అందులో చేర్చారు. దీంతో అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఆరావళి యూనిఫాం డెఫినిషన్‌ ఆమోదం తర్వాత #SAVEARAVALI క్యాంపెయిన్ సోషల్ మీడియాలో బలంగా సాగింది. ఎన్విరాన్‌మెంటలిస్టులు, యాక్టివిస్టులు ఆరావళికి మరణం శాసనం రాశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ అంశంపై విమర్శలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆరావళిలో మైనింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

Next Story