- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Blood money: నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపలేము.. ఒక్క అవకాశం ఉంది.. సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
కేరళ నర్సు నిమిష ప్రియను ఈ నెల 16వ తేదీన యెమెన్ దేశంలో చట్టపరంగా ఉరి తీయనున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ నర్సు (Nimisha Priya) నిమిష ప్రియను ఈ నెల 16వ తేదీన యెమెన్ దేశంలో చట్టపరంగా ఉరి తీయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు యెమెన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు సిద్దమైంది. అయితే ఆ మరణశిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై (Central government) కేంద్ర ప్రభుత్వం (Supreme Court) సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించింది. యొమెన్‌లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలి లేవని కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని.. ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఇది సాధారమైన కేసు కాదని, ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. అయితే నిమిష ప్రియ మరణశిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారి ఉందని, బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ (blood money) రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి రూ.8.6 కోట్లు సమర్పించాలని, అది వారి వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులు ఉంటాయని అటార్నీ జనరల్ కోర్టులో తెలిపారు. కాగా, నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్‌నర్, యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దో మెహదీని మరొక నర్సు సాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ అతని శరీరాన్ని ముక్కుల చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కోర్టులో ఆమె సవాల్ చేసింది. కానీ కోర్టు ఆమె అప్పీళ్లు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది. బుధవారం (జూలై 16) ఉరికంబం ఎక్కనున్నారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ 2008 నుంచి యెమెన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి ఆ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త, కుమార్తె కేరళకు తిరిగి వచ్చారు. కానీ నిమిషా యెమెన్‌లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే యెమెన్ దేశస్తుడితో కలిసి నిమిష ప్రియ నర్సింగ్ హోమ్ ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత యెమెన్ దేశస్తుడు తనను శారీరకంగా వేధించేవాడని, తన పాస్ పోర్ట్ తీసుకుని తనను ఆర్ధికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది. పాస్‌పోర్టు తీసుకోవడం కోసం యెమెన్ దేశస్థుడికి మత్తు మందు ఇవ్వడంతో.. అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లు ఆమె గతంలో కోర్టుకు తెలిపింది.






