- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆరావళి’ని కాపాడటమే మా లక్ష్యం: కేంద్ర మంత్రి
‘ఆరావళి’ని కాపాడటమే మా లక్ష్యం అని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆరావళి పర్వతాల్లో మైనింగ్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ఈ పర్వత శ్రేణిని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్‌లోని పర్వతశ్రేణిని శాస్త్రీయ ప్రమాణాలతో కాపాడాలని చెప్పిందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ‘గ్రీన్ ఆరావళి’ని ప్రమోట్ చేస్తూ వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ చర్యలకు గుర్తింపు దక్కిందని, మైనింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకే ఒక టెక్నీకల్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసిందని వివరించారు.
ఇదే సమయంలో 100 మీటర్ల అంశాన్ని కూడా వివరించిన ఆయన.. ఒక కొండ శిఖరం నుంచి నేల వరకు దాని ఎత్తును మాత్రమే కొలుస్తామని, అలాగే ఎన్సీఆర్ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ చేయడానికి అనుమతుల్లేవని స్పష్టంచేశారు. క్రిటికల్ అవసరాలకు తప్ప మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్తుందన్నారు. ఆరావళి ప్రాంతంలో 20 వైల్డ్ లైఫ్ శాంక్చువరీలు, నాలుగు టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయని, పర్యావరణ పరంగా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతమని చెప్పారు.






