రూ. 92 కోట్ల నక్సల్స్ ఆస్తులు స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం

by Malleboina Mahesh |

2026 మార్చి 31 వరకు దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో నక్సల్ కార్యకలాపాల ఆర్థిక మూలాలను కేంద్ర ప్రభుత్వం బలంగా దెబ్బ కొట్టింది.

రూ. 92 కోట్ల నక్సల్స్ ఆస్తులు స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: 2026 మార్చి 31 వరకు దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో నక్సల్ కార్యకలాపాల ఆర్థిక మూలాలను కేంద్ర ప్రభుత్వం బలంగా దెబ్బ కొట్టింది. పలు ఏజెన్సీల సమన్వయంతో చేపట్టిన చర్యల్లో భాగంగా సుమారు రూ. 92 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్యలు "అర్బన్ నక్సల్స్" (Urban Naxals) యొక్క సమాచార యుద్ధ నెట్‌వర్క్‌లపై (Information Warfare Networks) నియంత్రణను కఠినతరం చేయడం ద్వారా వారికి నైతికంగా, మానసికంగా తీవ్ర నష్టాన్ని కలిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

వారి నిధుల మార్గాలు స్తంభించాయి

దేశాన్ని మార్చి 2026 నాటికి నక్సల్ రహితంగా మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, నక్సల్స్ ఆర్థిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఏ ఒక్కటే రూ. 40 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అదనంగా రూ. 40 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రూ. 12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఏకకాల చర్య "అర్బన్ నక్సల్స్‌కు తీవ్ర నైతిక, మానసిక నష్టాన్ని కలిగించడంతో పాటు, వారి సమాచార యుద్ధ నెట్‌వర్క్‌లపై నియంత్రణను బిగించిందని" ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది.

Next Story