- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాస్టాగ్ లేకపోతే డబుల్ చార్జ్.. రూల్స్ మార్చిన కేంద్రం
by Phanindra |
ఫాస్టాగ్ లేకపోతే డబుల్ చార్జ్ రూల్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. డబ్బు రూపంలో చెల్లిస్తేనే డబుల్ చార్జ్ వసూలు చేయాలని నిర్ణయించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇంతకాలం వ్యాలిడ్ ఫాస్టాగ్ లేని వాహనదారులు రెట్టింపు టోల్ చార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఈ నిబంధనను సడలించిన కేంద్రం, యూపీఐ ద్వారా చెల్లించే వారు అదనంగా 25 శాతం చార్జీ చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. అదే నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం డబుల్ చార్జీ చెల్లించాల్సిందే. ఈ నిబంధనలు నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం, జాతీయ రహదారుల్లో సరైన ఫాస్టాగ్ ద్వారా రూ.100 టోల్ చెల్లించాల్సి వస్తే.. యూపీఐ ద్వారా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అదే నగదు రూపంలో అయితే రూ.200 కట్టాలి.
Next Story






