- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశ వ్యాప్తంగా రైతులకు 13వ విడత కింద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సాయం విడుదల చేసింది. సోమవారం కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 16,800 కోట్ల సాయాన్ని జమ చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదిలో 6 వేల రూపాయలను మూడు విడతల్లో అందజేస్తోంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






