- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్లీపర్ బస్సులపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు
ఇటీవల స్లీపర్ బస్సుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల స్లీపర్ బస్సుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను కేవలం ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అథారైజ్డ్ తయారీ సంస్థలే నిర్మించాలని స్పష్టం చేసింది. మాన్యువల్ బాడీ బిల్డర్లు సెల్ఫ్ సర్టిఫికేషన్‌తో బస్సులు తయారు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్లపై నడుస్తున్న స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, అత్యవసర ఎగ్జిట్‌లు (సుత్తులతో సహా), ఎమర్జెన్సీ లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తు గుర్తించే అలారం అమర్చాలని ఆదేశించారు.
ఈ నిబంధనలు AIS-052 (బస్ బాడీ కోడ్) సవరించిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుని, స్లీపర్ బస్సుల రంగాన్ని అన్‌ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్‌గా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా గడ్కరీ స్పష్టం చేసారు. కాగా గత ఆరు నెలల్లోనే దేశంలో జరిగిన వివిధ బస్సు ప్రమాదాల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు.
READ MORE .....






