పండగ సందర్భంగా నిలువు దోవుడీ.. ప్రైవేటు ట్రావెల్స్‌కు ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-10 10:59:39  IST  )

పండుగ రద్దీని అసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి...

పండగ సందర్భంగా నిలువు దోవుడీ.. ప్రైవేటు ట్రావెల్స్‌కు ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పండుగ రద్దీని అసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్(Private Travels) నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇష్టమొచ్చినట్లు రేట్లు పెడుతూ ప్రయాణికుల నుంచి డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ఏపీ రవాణా శాఖ(AP Transport Department) సీరియస్ అయింది. ప్రైవేటు దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించింది. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఆర్టీసీ ఛార్జీల కంటే గరిష్టంగా 50 శాతం మాత్రమే ప్రైవేటు ధరలు ఉండాలని స్పష్టం చేసింది. అంతకు మించితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. సంక్రాంతి పండగ సెలవులు ముగిసే వరకూ అన్ని జిల్లాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేస్తామని అధికారుల చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ 9281607001 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోనూ ఈ నెంబర్‌ను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు.

READ MORE .....

స్లీపర్ బస్సులపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు

Next Story