- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధం.. 47 మందిని తొలగించే ఛాన్స్!
దేశవ్యాప్తంగా నిర్వహించే పలు కీలక పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాల వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా నిర్వహించే పలు కీలక పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాల వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టి, వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ఈ చర్యల్లో భాగంగా NTA నుంచి సుమారు 47 మంది అధికారులను/సిబ్బందిని తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ధర్మేంద్రప్రధాన్ రాజీనామాకు కేంద్రం తలొగ్గకుండా.. బదులుగా NTAలో ప్రక్షాళన చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నిపుణుల కమిటీ సిఫార్సులు - వచ్చే నెలలోనే పునర్వ్యవస్థీకరణ
భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నాపత్రాల లీకేజీలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పారదర్శకతను పెంచేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (Expert Committee) ఇచ్చిన కీలక సిఫార్సుల ఆధారంగానే ఈ సంస్కరణలు అమలు చేయనున్నారు. వచ్చే నెలలోనే NTA పునర్వ్యవస్థీకరణ (NTA Restructuring) ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడం, అనుమానాస్పద సిబ్బందిని తొలగించడం ఈ ప్రక్షాళన ప్రధాన ఉద్దేశం. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే JEE Main, మెడికల్ సీట్ల కోసం నిర్వహించే NEET సహా దేశవ్యాప్తంగా ఏటా సుమారు 20 కి పైగా జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్రం ఈ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.






