Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ.. మంత్రులకు వీడ్కోలు ఇవ్వనున్న ప్రధాని మోడీ

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-03 08:15:12  IST  )

మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినేట్ చివరి భేటీ.. మంత్రులకు వీడ్కోలు ఇవ్వనున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 400 ఎంపీ స్థానాలపై కన్నేసింది. ఈ మేరకు శనివారం వివిధ రాష్ట్రాల్లో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మరో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులకు మోదీ వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. కాగా, మూడో సారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అమలు చేయాల్సిన పథకాలు, ప్రణాళికలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story