PM Modi : నేడు కేంద్ర కేబినెట్ భేటీ

by Muthe.Rajitha |

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం(Central Cabinet Meeting) కానుంది.

PM Modi : నేడు కేంద్ర కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం(Central Cabinet Meeting) కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాగా ఢిల్లీ ఎన్నికలు(Delhi Elections) జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలియ జేశాయి. ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) పథకం ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారికవర్గాలు వెల్లడించాయి.

Next Story