కాసేపట్లో సెంట్రల్ కేబినెట్‌ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi)లోని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధికారిక నివాసంలో ఆయన అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.

కాసేపట్లో సెంట్రల్ కేబినెట్‌ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధికారిక నివాసంలో ఆయన అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా సమాచారం. విధానపరమైన నిర్ణయాలు, అంతర్గత భద్రతా ఆందోళనలపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగ్రవాదం అణిచివేత, వాణిజ్యం, డిజిటల్ ఎన్‌ఫ్రాస్ట్రక్టర్ (Digital Infrastructure) లాంటి అంశాలు ప్రధానంగా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.

కాగా, మే 14న జరగిన కేబినెట్ సమావేశంలో భారత సెమీ కండక్టర్ మిషన్ (ISM) కింద రూ.3,706 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ కొత్త యూనిట్, HCL, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ల సంయుక్త సహకారంతో, యమునా ఎక్స్‌ప్రెస్‌ వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) ప్రాంతంలో నిర్మించనున్నారు. ఆ ప్లాంట్ నెలకు 20,000 వేఫర్లు, 36 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, ఆటోమొబైల్స్ ఇతర డిజిటల్ పరికరాలకు డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లను తయారు చేయనుంది. గుజరాత్ లోని సనంద్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్లు కేటాయించారు.

అదేవిధంగా చంద్రయాన్-4 మిషన్ కు రూ.2,104 కోట్లు, మిషన్ వీనస్‌కు రూ.1,236 కోట్లు, డెవలప్‌మెంట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు రూ.8,240, గగన్‌యాన్ ఫాలోకు రూ.20,193 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ హాన్స్మెంట్ స్కీమ్‌కు రూ.2,254 కోట్లు, విగ్యాన్ ధారకు రూ.10,579 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ కు రూ.391 కోట్లు, బయో E3 పాలసీ ఫర్ బయో మాను ఫ్యాక్చరింగ్ కు రూ.1500 కోట్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టార్ అండర్ ఏజిస్ ఆఫ్ IN-SPACeకు రూ.1000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్ ఏర్పాటుకు, తిరుపతిలో ఐఐటీ విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.

Next Story