- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని అధ్యక్షతన సెంట్రల్ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ ఢిల్లీ (Dehli)లోని సుష్మా స్వరాజ్ భవన్ (Sushma Swaraj Bhavan)లో కేంద్ర కేబినేట్ భేటీ సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ ఢిల్లీ (Dehli)లోని సుష్మా స్వరాజ్ భవన్ (Sushma Swaraj Bhavan)లో కేంద్ర కేబినేట్ భేటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరుకానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరును ప్రధానంగా సమీక్షించనున్నారు. అదేవిధంగా కీలక అంతర్గత విషయాలను చర్చించనున్నారు.
2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో పాటు సాధించిన విజయాలను వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోయే భారతీయ జనతా పార్టీ (Bhartiya Janatha Party) కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాటు వారి ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు జనాభా లెక్కలతో పాటు కులగణన (Cast Census) కూడా చేపడుతామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.






