Plane Crash : విమాన ప్రమాదంపై కేంద్రం కీలక ప్రకటన

by Muthe.Rajitha |

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) విచారణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది.

Plane Crash : విమాన ప్రమాదంపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) విచారణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు టేకాఫ్ అయిన బోయింగ్ విమానం 30 సెకన్లలోనే మేఘనీ నగర్‌లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌లోని వసతి గృహాలపై కూలిపోయి, 274 మంది మరణించారు. ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau) నేతృత్వంలో అమెరికా, యూకే నిపుణులు, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఎయిర్ ఇండియా, భారత నియంత్రణ సంస్థల ప్రతినిధుల సహకారంతో UN ICAO ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతోంది.

విచారణలో ఇంజన్ వైఫల్యం, ఫ్లాప్‌లు, లాండింగ్ గియర్, ఎలక్ట్రానిక్ లోపాలు, ఇంధన కలుషితం వంటి కారణాలతో పాటు విమాన శిథిలాలు, CCTV ఫుటేజీ, సాక్ష్యాలు, పైలట్ల శిక్షణ, విమాన బరువు, ఇంజన్ థరస్ట్, ACARS డేటాను విశ్లేషిస్తున్నారు. ICAO నిబంధనల ప్రకారం 30 రోజుల్లో ప్రాథమిక, 12 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంది. బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ నిర్ణయం ఏఏఐబీ సాంకేతిక ఆధారంగానే ఉంటుందని, మీడియా ఊహాగానాలు నమ్మవద్దని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. మరోవైపు DGCA ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8, 787-9 ఫ్లీట్‌లోని 34 విమానాల్లో 24 విమనాల్లో తనిఖీలు పూర్తి చేసి తీవ్ర లోపాలు లేవని తెలిపింది.

Next Story