- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాల వారీగా వివరాలు
by Gantepaka Srikanth |
దేశవ్యాప్త రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్త రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రుణాల కింద మొత్తం రూ.31,34,807 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. డీఎంకే సభ్యుడు రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పంట రుణాలు కింద రూ.16,34,219 కోట్లు, టర్మ్ లోన్స్ కింద రూ.15,00,588 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రాల పంట రుణాల వివరాలు..
1. తమిళనాడు: రూ.5,06,290 కోట్లు
2. ఆంధ్రప్రదేశ్: రూ.3,75,254 కోట్లు
3. మహారాష్ట్ర: రూ.3,07,293 కోట్లు
4. ఉత్తరప్రదేశ్: రూ.2,30,096 కోట్లు
5. కర్ణాటక: రూ.2,10,244 కోట్లు
6. రాజస్థాన్: రూ.1,92,293 కోట్లు
7. తెలంగాణ: రూ.1,75,960 కోట్లు
8. మధ్యప్రదేశ్: రూ.1,70,757 కోట్లు
9. గుజరాత్: రూ.1,68,460 కోట్లు
10. కేరళ: రూ.1,61,023 కోట్లు
Next Story






