- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
వంటగ్యాస్ సరఫరాపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వంటగ్యాస్ సరఫరాపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100శాతం ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని స్పష్టం చేసింది. హర్మూజ్ దగ్గర భారతీయ నౌకలు కూడా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్‌ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు, గ్యాస్ దొరుకుతుందా, లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచించింది. దేశంలో గృహ అవసరాలకు తగిన వంటగ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది.






