- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మరో ప్రకటన
దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలపై కేంద్ర ప్రభుత్వం(Central Government) క్లారిటీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలపై కేంద్ర ప్రభుత్వం(Central Government) క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. ఎక్సయిజ్ సుంకాన్ని(Excise Duty) ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. వాహనదారులు, ప్రజలు అవాస్తవాలు నమ్మి గందరగోళానికి గురికావొద్దని సూచనలు చేసింది. తాజాగా.. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty)ని రూ.2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 పలుకుతోంది. ఇదే సమయంలో డీజిల్ లీటరుకు రూ. 95.70 వద్ద ఉంది. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సుంకాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలోనే ఎక్సైజ్ సుంకం పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని కేంద్రం ప్రకటన చేసింది.
Read More..
వాహదారులకు BIG షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
Read More : సామాన్యులకు మరో BIG షాక్.. భారీగా గ్యాస్ ధరలు పెంపు






