సామాన్యులకు మరో BIG షాక్.. భారీగా గ్యాస్ ధరలు పెంపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 10:55:42  IST  )

సామాన్యులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government) మరో షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా భారీగా గ్యాస్ ధరలు(Gas Rates) పెంచింది.

సామాన్యులకు మరో BIG షాక్.. భారీగా గ్యాస్ ధరలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government) మరో షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా భారీగా గ్యాస్ ధరలు(Gas Rates) పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌(LPG Cylinder)పై రూ.50 పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. పెరిగిన ధరలు రేపు(మంగళవారం) నుంచే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వరుస షాకులు ఇస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త రేట్లు ప్రకటించాయి. ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటన చేసి వారం కూడా గడువకముందే మరోసారి రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story