దేశ రాజకీయాల్లో కొత్త శకం: 850కి చేరనున్న లోక్‌సభ సీట్ల సంఖ్య!

by Gantepaka Srikanth |

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

దేశ రాజకీయాల్లో కొత్త శకం: 850కి చేరనున్న లోక్‌సభ సీట్ల సంఖ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్రం తాజాగా సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచి, 850కి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు పెంచాలని నిర్ణయించింది. ఈ భారీ మార్పును అమలు చేయడం కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు బిల్లుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే ఎంపీలకు చేరవేసినట్లు తెలుస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంటులో ప్రజా ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొత్త పార్లమెంటు భవనంలో పెరగబోయే సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఇప్పటికే సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోనుంది.

Next Story