నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్లకు చెక్ పెట్టనున్న కేంద్రం

by Muthe.Rajitha |

రహదారులపై ప్రతిరోజూ వందలకొద్దీ యాక్సిడెంట్లు జరుగుతుండటం సహజం అయిపొయింది.

నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్లకు చెక్ పెట్టనున్న కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్ : రహదారులపై ప్రతిరోజూ వందలకొద్దీ యాక్సిడెంట్లు జరుగుతుండటం సహజం అయిపొయింది. రాష్ట్ర రహదారుల కంటే జాతీయ రహదారుల (National Highway)పై ప్రమాదాల సంఖ్య అత్యధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. యితే నేషనల్ హైవేల మీద జరిగే ప్రమాదాలకు, ముఖ్యంగా రహదారుల నిర్మాణ లోపం వల్ల జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

హైవేల మీద నిర్దిష్ట ప్రాంతంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత కాంట్రాక్టర్లకు భారీ జరిమానా విధించాలని రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (BOT) విధానంలో నిర్మించే రహదారులకు దీన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇకపై బీవోటీ విధానంలో నిర్మించే హైవేలపై ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్‌ వెల్లడించారు.

జాతీయ రహదారుల మీద యాక్సిడెంట్ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని 500 మీటర్ల పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టరుకు రూ.25లక్షల జరిమానా విధిస్తామన్నారు. అదేవిధంగా తర్వాత ఏడాది అదే చోట ప్రమాదం జరిగితే జరిమానా రూ.50లక్షలకు పెరుగుతుందని చెప్పారు. కాగా జరియా రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలో ఇటువంటి ప్రమాద ముప్పు ఉన్న 3500 ప్రాంతాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story