6 నెలల్లో ఎయిరిండియాకు 9 నోటీసులు..రాజ్యసభకు చెప్పిన కేంద్ర మంత్రి

by Phanindra |

గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు 9 నోటీసులు జారీచేశామని.రాజ్యసభకు కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు.

6 నెలల్లో ఎయిరిండియాకు 9 నోటీసులు..రాజ్యసభకు చెప్పిన కేంద్ర మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: గడిచిన ఆరు నెలల్లో ఎయిరిండియాకు 9 షోకాస్ నోటీసులు పంపినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఈ వివరాలు వెల్లడించిన విమానయాన శాఖ.. ఈ తొమ్మిది సందర్భాల్లో ఒకసారి ఎయిరిండియాపై చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో ఎయిరిండియా విశ్వసనీయతను దెబ్బతీసే అంశాలేవీ కనిపించలేదని విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధన్ మోహోల్ చెప్పారు. గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన ప్రమాదంలో 260 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చర్చ సందర్భంగానే మురళీ మోహోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 9 నోటీసులు పంపినప్పటికీ, ఎయిరిండియా విమానం కూలిపోయేంతటి సమస్యలేవీ ఆ సంస్థ విమానాల్లో కనిపించలేదని ఆయన స్పష్టంచేశారు.

Next Story