- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వాళ్ల సపోర్ట్‌తో రెచ్చిపోవడం కాదు’.. పాక్ ఆర్మీ చీఫ్‌కు కేంద్రం వార్నింగ్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్(Pakistan Army Chief Asim Munir) వ్యాఖ్యలపై కేంద్రం(NDA Govt) సీరియస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్(Pakistan Army Chief Asim Munir) వ్యాఖ్యలపై కేంద్రం(NDA Govt) సీరియస్ అయింది. అమెరికా నుంచి మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సందర్భంగా మునీర్ అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు అని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా భారత్‌పై రెచ్చిపోవడం పాక్ ఆర్మీకి అలవాటుగా మారింది అని విదేశాంగశాఖ ఎద్దేవా చేసింది. కాగా, ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో ఢిల్లీ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






