- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు.. 26 మంది మృతి
రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు చేరారని, వారిలో 26 మంది మృతి చెందారని కేంద్రం వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా సైన్యంలో పనిచేస్తూ 26 మంది భారతీయులు మరణించారని, అలాగే మరో ఏడుగురు గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కూడా కేంద్రం వెల్లడించింది. ఈ వివరాలను రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం రష్యా సైన్యంలో పనిచేస్తూ 12 మంది భారతీయులే మరణించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరణలో వెల్లడైంది. మొత్తం 202 మంది భారతీయులు రష్యా సైన్యంలో రిక్రూట్ అయినట్లు తమకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ జోక్యంతో వీరిలో 119 మందిని ఎర్లీ డిశ్చార్జ్ చేశారని, అయితే 26 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గల్లంతైనట్లు రష్యా వర్గాలు తెలిపాయని కేంద్ర మంత్రి వివరించారు. మరో 50 మంది ఎర్లీ డిశ్చార్జ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 10 మంది మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడంలో విదేశాంగ శాఖ సహాయం అందించిందని తెలిపారు. ఇద్దరు అంత్యక్రియలను రష్యాలోనే నిర్వహించడంలో కూడా విదేశాంగ శాఖ సహకరించిందన్నారు. మరణించిన, గల్లంతైన మరో 18 మంది డీఎన్ఏ శాంపిల్స్‌ను రష్యా అధికారులకు అందించామని, తద్వారా వారిని గుర్తించే వీలుంటుందని వివరించారు.






