- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే దేశవ్యాప్తంగా ‘మాక్ డ్రిల్’.. అందరూ కిటికీలు, తలుపులు మూసేయాలని కేంద్రం సూచన
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా(Pakistan), పాకిస్తాన్(India) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా(Pakistan), పాకిస్తాన్(India) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్(mock drills) జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న తరుణంలో ఎయిర్ స్ట్రైక్ బ్లాకౌట్ ఎలా చేయాలో కేంద్రం వీడియో రిలీజ్ చేసింది. 'సైరన్ మోగగానే అందరూ ఇళ్లల్లో లైట్లు, గృహోపకరణాలను ఆఫ్ చేయాలి. కిటికీలు, తలుపులు మూసేయాలి. అంతా ఒకే దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవాలి. చిన్న వెలుతురు కూడా మనకు ముప్పుగా మారవచ్చు. మార్పు మీతోనే మొదలవ్వాలి' అని వీడియోలో తెలిపింది.
Government of India issued a very important video.#MockDrill #Mock_Drill#mockdrill2025 pic.twitter.com/UcZSoLYsHI https://t.co/4qyNOB4sqj
— Ashutosh Krishna (@IAmKrishnaaX) May 6, 2025






