- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరవణె బుక్ ఎఫెక్ట్.. ఉన్నతాధికారుల పుస్తకాలపై 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్?
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నవరణే రచించిన Four Stars of Destiny పుస్తకం వివాదంతో కేంద్రం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అధికారుల పుస్తకాలపై 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధించే ప్రతిపాదన కేబినెట్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే సమావేశంలో ఎప్‍స్టిన్ ఫైల్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణే (M.M Naravane) రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) పుస్తకం ఇటీవల జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రచురణకు ముందే లీకైన ఈ పుస్తకంలోని అంశాలపై లోక్‍సభ వేధికగా అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. పొలిటికల్‍గా రచ్చ రాజేసిన ఈ పుస్తకం వివాదం నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విలటరీ సహా అత్యున్నత పదవుల్లో పని చేసిన వ్యక్తులు తమ పదవుల నుంచి రిటైర్ అయిన తర్వాత 20 ఏళ్ల వరకు వారి పుస్తకాలు పబ్లిష్ కాకుండా తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను (Cooling Off Period) అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలో లేకుండానే ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది.
ఎప్‍స్టిన్ ఫైల్స్ పై కూడా ప్రస్తావన:
ఈ సమావేశంలో జెఫ్రీ ఎప్‍స్టిన్ ఫైల్స్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించాలని, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మరింతగా స్పందించాల్సిన అవసరం లేదని మంత్రులు అభిప్రాయపడ్డారని అధికారులు వెల్లడించింది. పలు ఇమెయిల్స్‌ను ప్రస్తావిస్తూ ఎప్ స్టిన్ ఫైల్స్ తో సంబంధం ఉందని కేంద్ర మంత్రి Hardeep Singh Puri పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను ఇప్పటికే మంత్రి ఖండించారు. కాగా జాతీయ భద్రత, రహస్య సమాచార రక్షణ, సంస్థల్లో పని చేసిన వారు రాసే పుస్తకాల పబ్లిష్ చేసే విషయంలో ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. నరవణే పుస్తకం సైతం ప్రస్తుతం ఇదే దశలో ఆగిపోయింది. ఆయన రాసిన పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన రాసిన పుస్తకంలోని అంశాలు అంటూ రాజకీయ రచ్చ రాజుకోవడంతో ఇకపై కీలకపైమ పదవులు నిర్వహించి రిటైర్ అయిన ఉద్యోగులు రాసిన పుస్తకాలు పబ్లిష్ కావాలంటే 20 ఏళ్ల వరకు ఆగేలా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత సుదీర్ఘ కాలం కూల్ ఆఫ్ పీరియడ్ ను ఇప్పటి వరకు మన దేశంలో విధించిన దాఖలాలు లేవు. మరి కేంద్రం ఆలోచనపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ కాబోతున్నాయో చూడాలి.






