- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేఖా గుప్తా విషయంలో కేంద్రం యూటర్న్.. జెడ్ కేటగిరీ భద్రత క్యాన్సిల్
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta)పై ఈనెల 20న ‘జన్ సన్వాయ్’ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఆగంతకుడు దాడి చేసిన విషయం దేశంలో సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta)పై ఈనెల 20న ‘జన్ సన్వాయ్’ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఆగంతకుడు దాడి చేసిన విషయం దేశంలో సంచలనం సృష్టించింది. అయితే, ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం (Government Of India) సీఎం రేఖా గుప్తాకు అప్పటికప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో జెడ్ (Z) కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత ఐదు రోజులుగా సీఎం జెడ్ కేటగిరీ భద్రతతోనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, సీఎం రేఖా గుప్త సెక్యూరిటీ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. జెడ్ కేటగిరీతో ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యలయంలోని ఓ ముఖ్య అధికారి వెల్లడించారు. అయితే, ఇందుకు సంబంధించి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.






