ముప్పేట దాడికి కేంద్రం నిర్ణయం.. డ్రగ్ మాఫియాకు ఇక కష్టకాలమే!

by Gantepaka Srikanth |

దేశ భవిష్యత్తును పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

ముప్పేట దాడికి కేంద్రం నిర్ణయం.. డ్రగ్ మాఫియాకు ఇక కష్టకాలమే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ భవిష్యత్తును పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 2029 నాటికి ‘డ్రగ్ రహిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 నుంచి 2029 వరకు అమలు చేసేలా మూడేళ్ల ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర సంస్థలను కేంద్రం ఆదేశించింది. డ్రగ్స్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ఉన్న గొలుసుకట్టు నెట్‌వర్క్‌ను ఛేదించడమే కాకుండా, నిందితులకు శిక్షలు పడేలా అత్యాధునిక ఏఐ, డ్రోన్ టెక్నాలజీలను రంగంలోకి దించుతోంది. పార్లమెంటులో ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది.

సాంకేతికతతో నిఘా..

నేరగాళ్లకు శిక్షలు పడేలా చూడటంతోపాటు డిజిటల్ చెల్లింపుల ద్వారా సాగుతున్న నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. క్రైం జరిగిన ఏరియా నుంచి నేరుగా ఆధారాలను రికార్డు చేసేందుకు పోలీసులకు ఈ-సాక్ష్య పోర్టల్ సహకరిస్తుంది. బ్యాంక్ ఖాతాలు, పన్ను రికార్డులను విశ్లేషించి నిధుల ప్రవాహాన్ని గుర్తించేందుకు నాట్‌గ్రిడ్ ఉపయోగపడుతుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ద్వారా జరిగే లావాదేవీలపై నిఘా ఉంచడానికి, ఆస్తులను సీజ్ చేయడానికి సహయోగ్ పోర్టల్ రూపొందించారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) సహకారంతో డార్క్ నెట్, డ్రోన్ ఆధారిత ఫోరెన్సిక్స్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) వినియోగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా గొలుసును మూలాల నుంచే తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ సహకారం కోసం ఎన్సీబీ... రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ)తో ఎంఓయూ కుదుర్చుకుంది. డ్రగ్ మహమ్మారిని అరికట్టేందుకు కేవలం దాడులు మాత్రమే కాకుండా, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ద్వారా పోలీసులకు, ఎన్సీబీ అధికారులకు సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. 2029 నాటికి యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించి, దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

రూ. లక్ష కోట్లకు పైగా డ్రగ్స్ సీజ్..

గత ఐదేళ్లలో డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 నుంచి 2025 నవంబర్ వరకు దేశవ్యాప్తంగా వివిధ ఏజెన్సీలు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,06,794 కోట్లుగా ఉండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వివరాలు..




Next Story