Union Cabinet Meeting : ఖనిజాల అన్వేషణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

దేశంలోని ఆఫ్ షోర్ ప్రాంతాల్లో ఖనిజల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Union Cabinet Meeting : ఖనిజాల అన్వేషణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని ఆఫ్ షోర్ ప్రాంతాల్లో ఖనిజల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్(Union Cabinet Meeting) లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) మీడియాకు తెలియజేశారు. క్రిటికల్ మినిరల్స్ రంగంలో మరింత అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్(NCMM) కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రూ.16,300 కోట్లతో వ్యయంతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. ఈ విధానంతో దేశంలోని ఆఫ్షోర్ ప్రదేశాల్లో ఖనిజాల అన్వేషణకు మార్గం సుగమం అయింది.

అరుదైన ఖనిజాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించాలని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడమే ఈ మిషన్ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ వనరులు కలిగిన దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, దీని వల్ల అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి ప్రోత్సహించినట్టవుతుందని అన్నారు. ఇక సీ హెచ్వీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్(Ethanol) ధర లీటర్ కు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే మిగతా ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. పెట్రోల్ లో ఇథనాల్ ను కలపాలన్న లక్ష్యానికి అనుసరించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

Next Story