‘స్టే విధించొద్దు.. వీలైతే ఆ పిటిషన్లు కొట్టివేయండి’.. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకు కేంద్రం

by Gantepaka Srikanth |

వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Act)పై సుప్రీంకోర్టు(Supreme Court)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) అఫిడవిట్ దాఖలు చేసింది.

‘స్టే విధించొద్దు.. వీలైతే ఆ పిటిషన్లు కొట్టివేయండి’.. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకు కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Act)పై సుప్రీంకోర్టు(Supreme Court)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించొద్దని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగానికి లోబడే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా పనిచేయడం లేదని వెల్లడించింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని రిక్వెస్ట్ చేసింది. మరోవైపు.. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వక్ఫ్‌ సవరణ చట్టంలోని పలు సెక్షన్లను పిటిషన్‌లో సవాల్‌ చేసింది.

అయితే, వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, అక్కడ తేలిన తర్వాత ఈ పిటిషన్‌ను పరిశీలిద్దామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వక్ఫ్‌ చట్టం, సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఉద్యమం ఆగదని, మరింత ఉధృతం చేస్తామని ఓ వర్గం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. వక్స్‌ చట్టం సవరణ బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి.

Next Story