- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ రోజులు 125కు పెంపు.. పథకం పేరు మార్పు!
ఉపాధి హామీ రోజులు 125కు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే పథకం పేరు కూడా మార్చనుందట.

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేరును మార్చి ‘పూజ్య బాపూ రోజ్‌గార్ గారంటీ యోజన’ (పీజీఆర్‌జీవై)గా నామకరణం చేసే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కొత్త పేరుతో పాటు ఈ స్కీం కింద కనీసం ఉపాధి రోజుల సంఖ్యను కూడా కేంద్రం పెంచనుంది. ఇంతకుముందు ఈ పథకం కింద ఏటా కచ్చితంగా వంద రోజుల ఉపాధిని అందించేవారు. ఈ సంఖ్యను 125కు పెంచడంతోపాటు రోజు కూలీని రూ.240కు కేంద్రం సవరించినట్లు తెలుస్తోంది. దీని కోసం కేంద్రం 1.5 లక్షల కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఈ పథకం ద్వారా 15.4 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని. వీరిలో మూడో వంతతు మహిళలున్నారని అంచనా.






