Bathukamma Vedukalu : ఎల్లలు దాటిన సంబరం. అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

by Malleboina Mahesh |   (  Updated:2025-09-28 06:25:58  IST  )

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో ఘనంగా జరుపుకున్నారు.

Bathukamma Vedukalu  : ఎల్లలు దాటిన సంబరం. అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ (Bathukamma festival)ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస తెలంగాణకు చెందిన వారు అబుదాబిలో ఘనంగా జరుపుకున్నారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (India Social and Cultural Center) వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలు, ఎడారి ప్రాంతంలో పూలు దొరకకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ నుంచి వందల కిలోల పూలను ప్రత్యేకంగా తెప్పించటం ద్వారా నగరాన్ని పూల వనంగా మార్చడం విశేషంగా నిలిచింది. శనివారం ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో ప్రారంభమైన కార్యక్రమంలో First Secretary శ్రీ జార్జీ జార్జ్, గౌరవ అధ్యక్షులు, వివిధ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు, ప్రముఖ కవి గాయకులు, యువ కళాకారులు పాల్గొని ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. డప్పు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరింత వైభవంగా మారింది.

అందమైన బతుకమ్మలు, నాట్యం చేసిన మహిళలు, చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా నుంచి తెప్పించిన పిండి వంటకాలయిన అరిసెలు, గారెలు, బోబట్లు అందరినీ ఆకట్టుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని, ఈ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు. “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

Next Story