ఈవీఎంలపై సీఈసీ సంచలన నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-17 11:28:54  IST  )

బిహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈవీఎంలపై సీఈసీ సంచలన నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ (Bihar) ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవీఎం (EVM)లపై ప్రస్తుతం అభ్యర్థుల ఫొటోలు, పార్టీ గుర్తులను బ్లాక్ అండ్ వైట్‌ (Black & White)లో ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇక నుంచి వాటి స్థానంలో కలర్ ఫొటో (Color Photos)లను ఏర్పాటు చేయనున్నారు. బిహార్ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందిన కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఈవీఎం వ్యవస్థపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు లేవనెత్తుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి స్పష్టంగా కనిపించేలా ఎలాంటి అవకతవకలకు తావు లేదంటూ ఈవీఎంలపై కలర్ ఫొటోలను ముద్రించాలని నిర్ణయించామని సీఈసీ (CEC) స్పష్టం చేసింది.

Next Story