బిహార్‌కు ఈసీ పెద్దలు.. నేడు పట్నా వెళ్లనున్న సీఈసీ, ఈసీలు

by Phanindra |

బిహార్‌కు ఈసీ పెద్దలు వెళ్తున్నారు. నేడు సీఈసీ, ఈసీలు పట్నా వెళ్లి, ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

బిహార్‌కు ఈసీ పెద్దలు.. నేడు పట్నా వెళ్లనున్న సీఈసీ, ఈసీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు వివేక్ జోషీ, ఎస్ఎస్ సంధూ రెండ్రోజుల పర్యటన కోసం పట్నా వెళ్లనున్నట్లు ఈసీ తెలిపింది. బిహార్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షించేందుకే వీరు వెళ్తున్నట్లు సమాచారం. బిహార్ అసెంబ్లీ గడువు నవంబరు 22తో ముగియనుంది. ఈ క్రమంలోనే వివిధ దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఈసీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించడం మామూలే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 4-5 తేదీల్లో సీఈసీ, ఎలక్షన్ కమిషనర్లు బిహార్‌లో పర్యటించనున్నారు. దీంతో త్వరలోనే బిహార్ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story