- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: ఉక్రెయిన్‌లో మూడు రోజుల కాల్పుల విరమణ.. ప్రకటించిన రష్యా
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుతిన్ ఉక్రెయిన్‌లో మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin) ఉక్రెయిన్‌లో మూడు రోజుల పాటు ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించారు. ఇది మే 8 నుంచి10 వరకు అమల్లో ఉండనుంది. రష్యా 80వ విజయ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టైంలో అన్ని యుద్ధ కార్యకలాపాలు నిలిపివేస్తామని పేర్కొంది. ‘రష్యా విజయ దినోత్సవం సందర్భంగా ఈ డిసిషన్ తీసుకున్నాం. మానవతా దృక్పథంతో కీలక చర్యలు చేపట్టాం. మే 8 నుంచి కాల్పల విరమణ అమల్లోకి వస్తుంది. ఉక్రెయిన్ సైతం దీనికి కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ టైంలో కీవ్ ఉల్లంఘనలకు పాల్పడితే తగిన విధంగా ప్రతిస్పందిస్తాం’ అని పేర్కొంది.
ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే శాశ్వాత కాల్పుల విరమణకు పుతిన్ గతంలో నిరాకరించారు. కాగా, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఏటా మే8న విక్టరీ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సైనిక కవాతు నిర్వహిస్తుంది.






