- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: గాజాలో శాంతి.. అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం
గాజాలో15 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో15 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు పక్షాల మధ్య కుదిరిన అగ్రిమెంట్‌తో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:30 గంటలకే అమలు కావాల్సి ఉండగా.. ఇజ్రాయెలీ బందీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం జరగడంతో మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హమాస్ విడుదల చేసే బందీల పేర్లు వెల్లడించే వరకు సీజ్ ఫైర్‌కు ఒప్పుకోబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Nethanyahu) స్పష్టం చేయడంతో తొలుత కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బందీల వివరాలను హమాస్ వెల్లడించగా ఒప్పందం అమల్లోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. మొదటి రోజు ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుండగా.. వారి పేర్లు రోమీ గోనెన్, ఎమిలీ డమారి, డోరన్ స్టెయిన్‌బ్రేచర్ లుగా పేర్కొంది. తొలి దశ కాల్పుల విరమణ 42 రోజుల పాటు అమల్లో ఉండనుంది.
చివరి వరకూ దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్
హమాస్ పేర్లను వెల్లడించడంతో జాప్యం జరగడంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఉత్తర గాజా, మధ్య గాజాల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది గాయపడ్డారు. విడుదల చేయాల్సిన బందీల పేర్లను వెల్లడించకుండా కాల్పుల విరమణను హమాస్ ఆలస్యం చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే సాంకేతిక కారణాల వల్లే జాప్యం జరిగిందని హమాస్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి వ్యతిరేకంగా రైట్-వింగ్ పార్టీ ఓట్జ్మా యెహుదిత్ నెతన్యాహు ప్రభుత్వం నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది.






