- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాక్.. ఇండియన్ ఆర్మీ కీలక విజ్ఞప్తి
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి. పాక్ కవ్వింపులకు పాల్పడగా భారత బలగాలు దానిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు పేర్కొన్నాయి. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) అనంతరం తొలిసారిగా పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించాయి. అయితే ఈ కథనాలను సైన్యం తిరస్కరించింది. ఎల్ఓసీ వెంబడి ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ‘పూంచ్ ప్రాంతంలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి కొన్ని మీడియా, సోషల్ మీడియా ప్లా్ట్ ఫాంలలో కథనాలు వచ్చాయి. నియంత్రణ రేఖ వెంబడి ఎటువంటి ఉల్లంఘన జరగలేదు. ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నియంత్రించండి’ అని భారత సైన్యం పేర్కొంది.






