- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: సీజ్ ఫైర్ ఉల్లంఘించిన ఇజ్రాయెల్.. గాజాలో కాల్పులు !
హమాస్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరోసారి ఉల్లంఘించింది.

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరోసారి ఉల్లంఘించింది. గాజాలో కాల్పులు జరపగా ఓ పాలస్తీనా వ్యక్తి మరణించడంతో పాటు ఏడుగురు గాయపడ్టట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వేలాది మంది ప్రజలు ఉత్తర గాజాకు తిరిగిరావడానికి గుమిగూడగా వారిపై ఇజ్రాయెల్ కాల్పులకు తెగపడ్టట్టు తెలుస్తోంది. శరణార్థులు గాజాలోకి తిరిగి రాకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలకు దిగినట్టు హమాస్ ఆరోపించింది. కాలినడకన ప్రయాణిస్తున్న వారిపై కాల్పులు జరిపినట్టు తెలిపింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. కాగా, ఇజ్రాయెల్, హమాస్ (Israel hamas) మధ్య ఈ నెల 19 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు హమాస్ ఏడుగురు బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 200 మంది సైనికులను రిలీజ్ చేసింది. మరోవైపు గాజా నుంచి వీలైనంత ఎక్కువ మంది పాలస్తీనా శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వాలని జోర్డాన్, ఈజిప్ట్‌లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.






