- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ.. రేపటి నుంచి అమల్లోకి
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో 15 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరపడటం ఖాయమైంది. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైంది. ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఆదివారం GMT 6:30 గంటల నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని చర్చలకు మధ్య వర్తిత్వం వహించిన ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యవర్తిత్వ దేశాలైన ఖతార్ (Qutar), ఈజిప్ట్ (Egypt), అమెరికా (America), కైరోలోని ఒక సంస్థ ద్వారా సంధి ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించనున్నారు. మొదటి దశ కాల్పుల విరమణ 42 రోజుల పాటు కొనసాగనుంది.
ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
అంతకుముందు హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలోని కొంత మంది నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. అనుకూలంగా 24 మంది ఓటేయగా 8 మంది వ్యతిరేకంగా ఓటేసినట్టు ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో త్వరలోనే గాజాలో శాంతి నెలకొననున్నట్టు పలువురు భావిస్తుండగా, బంధీలుగా ఉన్న వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
33 బందీలు, 737 ఖైదీలు, 42 రోజులు
కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ 42 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టైంలో హమాస్ చేతిలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వారిలో 737 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేయనుంది. ఇందులో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. అంతేగాక గాజా సరిహద్దుకు 700 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లనుంది. అయితే స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4 గంటలలోపు ఎవరినీ విడుదల చేయబోమని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని న్యాయ మంత్రిత్వ శాఖ 95 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను కూడా విడుదల చేసింది. వీరిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు, 10 మంది మైనర్లు ఉన్నారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన రెండో దశ మొదటి దశ అమలులో భాగంగా 16వ రోజు నుంచి ప్రారంభమవనున్నట్టు ఖతార్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.






