Ceasefire: ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ.. పుతిన్ సంచలన నిర్ణయం

by B.Srinivas |

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించారు.

Ceasefire: ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ.. పుతిన్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రైస్లవుల ఈస్టర్ (Ester) పండుగ సందర్భంగా ఉక్రెయిన్‌లో ఒక రోజు కాల్పుల విరమణ ప్రకటించారు. ఏకపక్షంగా పుతిన్ ఈ డిసిషన్‌ను వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ గెరాసిమోవ్‌తో క్రెమ్లిన్‌లో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు. ‘మానవతా దృక్పథం ఆధారంగా రష్యా వైపు ఈస్టర్ సంధిని ప్రకటించింది. ఈ కాలంలో అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తున్నా’ అని వెల్లడించారు.

ఉక్రెయిన్ సైతం రష్యా బాటలోనే నడుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ టైంలో కాల్పుల విరమణ ఉల్లంఘన, రెచ్చగొట్టడం, దూకుడు చర్యలకు ప్రతిస్పందించడానికి రష్యా దళాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రష్యా ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కాల్పుల విమరణ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Next Story