- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire: థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సీజ్ ఫైర్.. చర్చలకు ఇరు దేశాల అంగీకారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత థాయిలాండ్, కంబోడియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యవర్తిత్వం తర్వాత థాయిలాండ్ (Thailand), కంబోడియా (Kambodiya) లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు చర్చలు జరపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు దేశాలు తెలిపాయి. తమ దేశం తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించిందని కంబోడియా ప్రధాని హున్ మానెట్ తెలిపారు. ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత థాయిలాండ్ సైతం దీనికి ఒప్పుకుందని వెల్లడించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో తదుపరి చర్యలను సమన్వయం చేయడానికి, థాయిలాండ్ విదేశాంగ మంత్రితో నేరుగా చర్చలు జరపడానికి తన డిప్యూటీ విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్‌ను నియమించినట్టు చెప్పారు. దీంతో ఇరు దేశాలు మలేషియాలో భేటీ అయి చర్చలు జరపనున్నట్టు థాయ్ ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
కాగా, రెండు వేల సంవత్సరాల పురాతన ఆలయాలపై థాయిలాండ్, కంబోడియా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతలు పెరగడంతో ట్రంప్ రెండు దేశాల ప్రతినిధులతో ఫోన్‌లో చర్చించారు. ఈ క్రమంలోనే కాల్పుల సీజ్ ఫైర్‌కు అంగీకరించడం గమనార్హం.






