- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌నాథ్ సింగ్‌తో CDS అనిల్ చౌహాన్ భేటీ.. ఉగ్రదాడి, తాజా పరిస్థితిపై చర్చ
భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)తో సీడీఎస్(Chief of Defence Staff) అనిల్ చౌహాన్(Anil Chauhan) భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh)తో సీడీఎస్(Chief of Defence Staff) అనిల్ చౌహాన్(Anil Chauhan) భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో పాటు తాజా పరిస్థితిపై కీలకంగా చర్చిస్తున్నారు. తదుపరి చర్యలపైనా చర్చ చేస్తున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం(Pahalgam) బైనసర్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పు(Terrorist Attack)ల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని, కుట్రదారులను ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని, త్వరలోనే అత్యంత కఠినంగా వారిని శిక్షిస్తామని.. పాక్ కుట్రలపై ప్రతీకారం తీర్చుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు నేవీ చీఫ్తి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌పోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌లతో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.






